తెలుగులో భారీ అమౌంట్ ఆశిస్తున్న శంకర్

shankar
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడంతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శంకర్. సౌత్ ఇండియాలో శంకర్ అంటే భారీ బడ్జెట్ మరియు సరికొత్తదనానికి పెట్టింది పేరు. తన సూపర్ హిట్ సినిమాలతో సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ ని మరింత పెంచేశారు.

ప్రస్తుతం శంకర్ విక్రమ్ తో చేసిన ‘ఐ’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదే సినిమా తెలుగులో ‘మనోహరుడు’గా రానుంది. ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం శంకర్ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి భారీ అమౌంట్ ని ఆశిస్తున్నారు. దానికి కారణం ఈ సినిమాని సుమారు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించడమే..

మాకు అందిన సమాచారం ప్రకారం శంకర్ తెలుగు రైట్స్ కోసం సుమారు 30 కోట్లు ఆశిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ని తలపించేలా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ ని ప్లాన్ చేసారు. విక్రమ్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version