‘రోబో 2’ కోసం పాపులర్ రైటర్ ని రంగంలోకి దించిన శంకర్

shankar_rajinikanth
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే అట్టకత్తి, మద్రాస్ సినిమాలతో మెప్పించిన పిఏ రంజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కొద్ది రోజుల క్రితమే తెలియజేశాం. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చెయ్యాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా తర్వాత రజినీకాంత్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి రోబో సినిమాకి సీక్వెల్ చేయనున్నాడు.

ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం శకర్ ఓ ఫేమస్ రైటర్ ని రంగంలోకి దింపాడు. తమిళ మరియు మలయాళంలో బాగా ఫేమస్ అయిన నవలా రచయితా, స్క్రీన్ ప్లే రైటర్ బి. జేయమోహన్ ని రోబో 2 కి కథ రచయితగా సెలక్ట్ చేసారు. తమిళ లిటరసీ మీద మంచి పట్టున్న జేయమోహన్ మణిరత్నం కడలి, కమల్ హాసన్ పాపనాశం, బాల ‘నేను దేవుణ్ణి’, సిద్దార్థ్ కావ్య తలైవన్ సినిమాలకు పనిచేసారు. హై రేంజ్ గ్రాఫిక్స్ ఉండనున్న ఈ సినిమా ఈ సంవత్సరం చివరి లోపు సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version