ఇంటర్వ్యూ : శర్వానంద్ – రివ్యూ లు కొంచెం కనికరిస్తే ఫలితం వేరేలా ఉండేది


శర్వానంద్ , కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం రణరంగం. ఈనెల 15న స్వాతంత్య్రదినోత్సవం కానుకగా విడుద అయ్యింది. సుధీర్ వర్మ తెరకెక్కించిన రణరంగం గ్యాంగ్ స్టర్ డ్రామాకి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. ఈ సంధర్బంగా హీరో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలేమిటో చూద్దాం…

 

చిత్ర ఫలితం పై మీ స్పందన ఏమిటీ?

యా ఓకే..మూవీకి మంచి స్పందనే వచ్చింది. కానీ మేము ఊహించినంత ఫలితం ఐతే రాలేదు. ఇంకా పెద్ద విజయం సాధిస్తుందని ఉహించాము. ఐతే రివ్యూలు కొంచెం అనుకూలంగా వచ్చి ఉంట్లే ఇంకొంచెం మంచి ఫలితం అందేది.

 

మీరు ఈ మూవీలో నటించడానికి కారణాలు చెవుతారా?
ముఖ్యంగా రణరంగం స్క్రీన్ ప్లే నచ్చి ఈ మూవీ చేయడం జరిగింది. అలాగే దర్శకుడు సుధీర్ వర్మ గత చిత్రాల టేకింగ్ నచ్చడం కూడా మరొక కారణం. రెగ్యులర్ గా చేస్తున్న లవ్ , ఫ్యామిలీ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని ఈ మూవీ చేయడం జరిగింది.

 

గ్యాంగ్ స్టర్ పాత్ర కోసం ఈ మూవీ చేశారా ?

అలా అని కాదు, నాపాత్రలో రెండు విభిన్న షేడ్స్ ఉంటాయి . యంగ్ మాస్ కుర్రాడిలా, అలాగే రిచ్ గ్యాంగ్ స్టర్ లా,ఇలా రెండు భిన్న పాత్రల వలన నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అందుకే చేయడం జరిగింది.

 

మూవీ ఫలితం ఇలా రావడానికి కారణం చెవుతారా ?

స్క్రీన్ ప్లే బేస్డ్ స్టైలిష్ మూవీ చేద్దాం అనుకున్నాం. కానీ కొంచెం ఫలితం ప్రతికూలంగా వచ్చింది.ఐతే మూవీ చుసిన ప్రేక్షకులెవ్వరూ బాగాలేదు అని అన్నదాఖలాలు లేవు, ప్రేక్షకుల తీర్పుకి, అలాగే రివ్యూ కి సంబంధం లేదు.అందుకే ఎక్కడ తప్పు జరిగింది అనేది నాకు ఇంకా అర్థం కావడం లేదు. రివ్యూస్ కూడా కొంచెం మంచి రేటింగ్ ఇచ్చివుంటే వసూళ్లు ఇంకొంచెం మంచిగా ఉండేవి.

 

మూవీ రివ్యూ ని మీరు తప్పుబడుతున్నారా?

అలా ఏమి కాదు,మీరు మూవీలో కథలేదని రాశారు. అది నిజమే కదా. రణరంగం స్టోరీ బేస్డ్ ఫిలిం కాదు, స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిం నేను చెవుతున్నాను. కాకపోతే శర్వా మనవాడే కదా అని కొంచెం పాజిటివ్ రివ్యూ ఇచ్చి ఉంటె కొంచెం వసూళ్లు బాగుండేవని చెవుతున్నాను.

 

కథ లేకుండా మూవీ తీస్తే విమర్శలు వస్తాయని మీకు అనిపించలేదా?

అంటే అసలు స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, అని ప్రశంలు అందుతాయని భావించాం. కానీ అది వర్క్ అవుట్ కాలేదు.

 

రణరంగం విజయం సాధిస్తే ఇలాంటి చిత్రాలనే చేస్తారా?

లేదు, నేను ఎప్పుడూ ఒక జోనర్ చిత్రాలనే చేయలేదు. ప్రస్థానం లాంటి సీరియస్ పొలిటికల్ మూవీ తరువాత కామెడీ, లవ్ చిత్రాలు చేయడం జరిగింది. శర్వా మూవీ అంటే మంచి కథ ఉంటుందని మూవీకి వస్తారు. ఈసారి ఆ అంచలనాలు అందుకోలేకపోయాం.

 

మీ భవిష్యత్ చిత్రాల గురించి చెవుతారా?

96మూవీ షూటింగ్ 50 శాతం పూర్తయింది. శ్రీకారం అనే ఒక స్టోరీ బేస్డ్ మూవీ చేస్తున్నాను. అలాగే ఓ తమిళ తెలుగు బైలింగ్వల్ మూవీ చేస్తున్నాను.

 

Exit mobile version