మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే ‘పెద్ది’. మరి ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. కానీ దాని తర్వాత రెండో సాంగ్ కి మాత్రం మేకర్స్ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు కానీ ఒక బ్యాంగర్ పాటనే ఫైనల్ గా వదిలారు అని చెప్పవచ్చు.
ఏ ఆర్ రెహమాన్ వాయిస్ లోనే మొదలైన ఈ సాంగ్ కి తాను ఒక మ్యాడ్ బీట్స్ ని అందించారు అని చెప్పాలి. మంచి బేస్ తో ఆకట్టుకునే సాహిత్యంతో ముఖ్యంగా చివరి చరణంలో ఒక సోల్ తెలుస్తుంది. ఇలా ఈ సాంగ్ ఫ్యాన్స్ కి మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చేసే విధంగానే ఉంది. అలాగే సినిమా అనౌన్సమెంట్ టైం లో ఇచ్చిన స్కోర్ ఇందులో మిక్స్ చేయడంతో ఫ్యాన్స్ కి ఇది మరింత కిక్ ఇచ్చే ట్రాక్ అని చెప్పాల్సిందే.
ఇక లిరికల్ వీడియోలో రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ గాని తన స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది సాంగ్ ఈ రేంజ్ లో ఈ టోన్ లో ఉంటుందని ఊహించి కూడా ఉండకపోవచ్చు. దీనితో బుచ్చిబాబు మాత్రం ఒక బ్యాంగర్ ని డెలివర్ చేశారు. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించగా ఈ ఏప్రిల్ 30న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
