సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తోన్న సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈరోజు వైజాగ్లో ప్రారంభం అయ్యింది. కొన్ని రోజులు ఇక్కడ షూటింగ్ జరిపి ఆ తర్వాత కాకినాడలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు టీమ్. శర్వానంద్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ‘హలో’ సినిమాతో కథానాయకిగా పరిచయమైన కళ్యాణి ప్రియదర్శిని ఈ మూవీలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు శర్వానంద్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.
