‘భోగి’ కోసం యాక్షన్ మోడ్‌లోకి శర్వా.. మామూలుగా ఉండదట..!

Bhogi

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భోగి’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా ఇందుకోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో, ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. విరామం లేకుండా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో శర్వానంద్ పూర్తిస్థాయిలో పాల్గొంటున్నాడు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా 1960ల నాటి సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంతో సాగుతుంది. ఇటీవల విడుదలైన ‘ఫస్ట్ స్పార్క్’ కాన్సెప్ట్ వీడియో సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజా వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో శర్వానంద్ చేతిలో సుత్తి పట్టుకుని, పొగమంచు మధ్య పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తూ పక్కా మాస్ యాక్షన్ ట్రీట్‌ను తలపిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version