శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందట !

శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామాకు సంబంధించిన నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్రబృందం ఈ సినిమాను మే 31వ తేదీన విడుదల చెయ్యాలని చూస్తున్నట్లు సమాచారం.

కాగా ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ లో శర్వానంద్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ చిత్రంలో చాలా భాగం విదేశాలలో చిత్రీకరిస్తోన్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ తో పాటు కళ్యాణి ప్రియదర్శిని కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Exit mobile version