రోడ్ జర్నీ నేపథ్యంలో శర్వానంద్ ఎక్స్‌ప్రెస్ రాజా!

Sharwanand
శర్వానంద్ సినిమాల ఎంపిక గురించీ, అతడి నటన గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్‌లో విలక్షణ సినిమాలను, పాత్రలను ఎంచుకుంటూ వెళుతోన్న హీరోల్లో శర్వానంద్ ఒకరు. ‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ లాంటి సినిమాలతో రీసెంట్‌గా మంచి హిట్స్ అందుకున్న శర్వానంద్, తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకెళుతోన్న యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎక్స్‌ప్రెస్ రాజా సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో ఓ సరికొత్త స్టోరీలైన్‌తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. తన మొదటి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఒక డిఫరెంట్ పాయింట్‌ను టచ్ చేస్తూ సూపర్ హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ ఈ సినిమాలోనూ తనదైన మార్క్ చూపెట్టనున్నారని తెలుస్తోంది. శర్వానంద్ సరసన ఈ సినిమాలో సురభి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Exit mobile version