దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. తాజాగా ఈ మూవీలో శర్వానంద్ నటించే పాత్రల పై క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. శర్వానంద్ రెండు వేర్వేరు పాత్రల్లో కనిపిస్తారట. పీరియాడిక్ నేపథ్యంలో వచ్చే పాత్రతో పాటు, లైవ్ లో సాగే రెగ్యులర్ హీరో పాత్రలో కూడా శర్వానంద్ కనిపించనున్నారని టాక్. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు.
ఇక భాగ్యశ్రీ బోర్సే ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అనంతరం జరగబోయే రెండో షెడ్యూల్ లో హీరో – హీరోయిన్ల పై లవ్ సీన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నాడు.


