
విక్రం,అనుష్కలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం “శివతాండవం”. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ వారు ఎటువంటి కట్స్ లేకుండా “యు” సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్‌ని సి కళ్యాణ్ తేజ సినిమా బ్యానర్ మీద నిర్మించారు. ఈ చిత్రంలో జగపతి బాబు పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా ఏమి జాక్సన్, లక్ష్మి రాయిలు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విక్రం ద్విపాత్రాభినయం చెయ్యనున్నారు. అందులో ఒకటి సేక్రేట్ ఏజెంట్ పాత్ర కాగా మరికటి అంధుడి పాత్ర. గతంలో ఏ ఎల్ విజయ్ “నాన్న” మరియు” 1947 లవ్ స్టొరీ” వంటి చిత్రాలు మన రాష్ట్రంలో మంచి పేరుని సంపాదించుకున్నా. ఈ చిత్ర ట్రైలర్లు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోనగా ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి జి వి ప్రకాష్ సంగీతం అందించారు నిరావ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. వచ్చే వారాంతంలో ప్రభాస్ “రెబల్” చిత్రంతో ఈ చిత్రం పోటిపడనుంది. ఈ చిత్రం “రెబల్” ధాటిని తట్టుకోగలద అన్నదే ఇక్కడ ప్రశ్న. ఏమవుతుందో వేచి చూడాల్సిందే.
సెన్సార్ నుండి యు సర్టిఫికేట్ అందుకున్న “శివ తాండవం”
సెన్సార్ నుండి యు సర్టిఫికేట్ అందుకున్న “శివ తాండవం”
Published on Sep 20, 2012 10:00 PM IST
సంబంధిత సమాచారం
- విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?
- సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
- రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!
- సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!
- స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!
- కామ్రేడ్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది అప్పడే..!
- వరల్డ్ వైడ్ మాంచి ఓపెనింగ్స్ తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు లోనే లీడ్!
- సమీక్ష: ‘పళ్ళ బురుసు’ – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- విశ్వనాథ్ అండ్ సన్స్ రిపోర్ట్ కార్డ్: నటన, సాంకేతిక వర్గం & ఫైనల్ తీర్పు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

