రామ్ ‘శివమ్’ సెన్సార్ పూర్తి

Shivam
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి రూపొందించిన హై వోల్టేజ్ లవ్‌స్టోరీ ‘శివమ్’. లవ్, యాక్షన్, కామెడీ ఇలా అన్ని కమర్షియల్ అంశాలనూ మేళవించుకున్న ఈ సినిమాను స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఇక ఇప్పటికే అన్ని టెక్నికల్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా గత కొద్దిసేపటి క్రితం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ఏ కట్స్ చెప్పకుండా ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇక అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలుకాగా, రేపట్నుంచి హీరో రామ్, హీరోయిన్ రాశి ఖన్నాలు కూడా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగం కానున్నారు. పండగ చేస్కో లాంటి హిట్ తర్వాత రామ్ నటించిన సినిమా కావడం, ఆడియో, ట్రైలర్స్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, ఆ పాటలను అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

Exit mobile version