కమల్ హాసన్ పై శివ రాజ్‌కుమార్‌ క్రేజీ కామెంట్స్

shivaraj kumar

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’. సాయి రామ్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ చెన్నై వేదికగా ఆడియో లాంచ్‌ నిర్వహించారు. కన్నడ యాక్టర్ శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఆయన నవ్వు, కళ్లు, వ్యక్తిత్వం అంటే నాకిష్టం. ఆయనలోని ప్రతి విషయాన్ని నేను ఇష్టపడతాను. ఆయన సినిమాలు మొదటి రోజు, మొదటి షోలోనే చూస్తాను’ అని తెలిపారు.

అలాగే, శివ రాజ్‌కుమార్‌, కమల్‌ హాసన్‌ గురించి మాట్లాడుతూ..‘నాకింకా గుర్తుంది. ఆయన మా ఇంటికి వచ్చారు. మా నాన్న డా. రాజ్‌కుమార్‌తో ఆయన మాట్లాడారు. నాన్న నన్ను ఆయనకు పరిచయం చేశారు. నేను ఒక హగ్‌ ఇవ్వమని అడిగాను. ఆ తర్వాత నేను మూడు రోజుల పాటు స్నానం చేయలేదు. ఆ హగ్‌ ఫీలింగ్‌ అలాగే ఉండాలని కోరుకున్నాను. ఆయన సినిమాల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే నేను వారితో గొడవపడేవాడిని. వారు చెడుగా చెప్పినా నేను మంచి గురించే ఆలోచిస్తాను’ అని శివ రాజ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version