ఇక్కడ వెంకటేష్.. అక్కడ శివరాజ్ కుమార్

Shivaraj Kumar

తమిళ హిట్ మూవీ ‘అసురన్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ పాత్రను విక్టరీ వెంకటేష్ చేస్తుండగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా 60 శాతం ముగిసింద కూడ. ఇకపోతే ఈ సినిమాను కన్నడలోకి కూడా రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్లో సీనియర్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించనున్నారని తెలుస్తోంది.

శివరాజ్ కుమార్ స్వతహాగానే రియలిస్టిక్ కథలు, పాత్రలు అంటే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆ ఆసక్తితోనే ఆయన ఈ రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారట. ఈ చిత్రాన్ని జాకబ్ వెర్ఘెసె డైరెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే రెండు భాషల్లో ఇద్దరు పెద్ద హీరోలు వెంట వెంటనే రీమేక్ చేయనుండటం నిజంగా విశేషమే అనాలి.

Exit mobile version