సల్మాన్ ఖాన్‌తో శోభి మాస్టర్.. మామూలుగా ఉండదట..!

Salman-Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అఫీషియల్‌గా లాంచ్ కూడా చేశారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయ్యింది.

ఈ సినిమాకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శోభి మాస్టర్ వర్క్ చేస్తున్నట్లు ఆయన స్వయంగా పేర్కొన్నారు. హీరో సల్మాన్ ఖాన్‌తో కలిసి దిగిన ఓ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేగాక, సల్మాన్ లాంటి స్టార్ హీరోతో వర్క్ చేయడం తమ అదృష్టమని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేసిన శోభి మాస్టర్ ఇప్పుడు సల్మాన్‌తో పనిచేస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 ఈద్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version