ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మమితా బైజు కీలక పాత్రలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే జన నాయగన్. మన తెలుగు బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి కి రీమేక్ గా తెరకెక్కింది కానీ విజయ్ ఆఖరి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఎన్నో ఆశలు ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఎప్పుడో జనవరి లోనే రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ రాలేదు.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు ఊహించని విధంగా ఆన్లైన్ లీక్ అయ్యిన షాకింగ్ వార్త అభిమానులకి షాకిచ్చింది. ఇంకా థియేటర్స్ లోకి కూడా రాకుండా లీక్ అవ్వడం అనేది ఒకింత బాధాకరం కానీ కేవలం కొన్ని సీన్స్ ఇంకా పాటలు లీక్ అయిపోయినట్టు తెలుస్తోంది. దీనితో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.
