షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?

షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?

Published on Aug 19, 2026 3:00 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కలయికలో చేస్తున్న సినిమా ‘ధర్మన్’ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా తాలూకా షూట్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతుంది. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ ఒక డెడ్లీ డాక్టర్ గా కనిపించనుండగా ఓ షాకింగ్ బజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ పోతినేని రజినీకి వ్యతిరేక పాత్రలో కనిపించనున్నట్టు క్రేజీ రూమర్స్ ఇపుడు మొదలయ్యాయి. ఇందులో రజినీకాంత్ కి అల్లుడు పాత్రలో నెగిటివ్ షేడ్స్ ని ఎనర్జిటిక్ స్టార్ చూపించనున్నట్టుగా ఇపుడు టాక్ వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతానికి రామ్ ని సంప్రదించడం వరకే వెళ్లినట్టు టాక్. దీనికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. ఇంకోపక్క తాను హీరోగా, దర్శకత్వం కూడా వహిస్తున్న సినిమా షూట్ లో కూడా తాను బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు