ముంబైలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి (Rohit Shetty)ఇంటి వద్ద జరిగిన కాల్పులు ప్రస్తుతం హాట్ టాపిక్ ఆగ మారాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అంశం పై ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. అసలు కాల్పులు ఎప్పుడు జరిగాయి అంటే.. ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన కలకలం రేపింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.
ఐతే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ కాల్పుల సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రసుతం దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ కాల్పులు ఎవరి కోసం చేశారు ?, ఎందుకు చేశారు ?, ఇంతకీ.. కాల్పుల సమయంలో రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా ? లేదా ? అనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. కాల్పుల నేపథ్యంలో అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది.
