షాకింగ్: నైజాంలో హైక్స్ కావాలంటే 90 రోజులు ముందే..

గత కొన్నాళ్ల నుంచి మన తెలుగు సినిమా దగ్గర టికెట్ ధరల హైక్స్ సంప్రదాయం ఎలా కొనసాగుతుందో వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ హైక్స్ అనేవి మొదట పలు భారీ సినిమాలు వాటికి అయ్యే ఖర్చులకి వచ్చేవి కానీ ఇప్పుడు చిన్న సినిమాలకి కూడా అధిక ధరలు ఇచ్చేస్తున్నారు.

ఇక ఇదే నైజాం మార్కెట్ లో కూడా కొనసాగుతూ ఉన్నప్పటికీ కొన్నేళ్ల నుంచి మాత్రం దీనికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధిక టికెట్ ధరలు ఎందుకు అని ప్రతీ సినిమాకి అవసరం ఏముంది అని కొన్ని వెర్షన్ లు ఉన్నాయి. ఇలా ఈ తతంగం అంతా ఫైనల్ గా హై కోర్ట్ వరకు కూడా వెళ్ళింది. ఇటీవల సంక్రాంతి సినిమాలకి కూడా కొంచెం టెన్షన్ పట్టుకుంది.

కానీ ఫైనల్ గా అసలు నైజాం మార్కెట్ లో టికెట్ ధరల హైక్స్ పై హై కోర్ట్ ఓ షాకింగ్ తీర్పుని ఇప్పుడు అందించింది. ఇక నుంచి తెలంగాణాలో ఏ సినిమాకి అయినా టికెట్ ధరల పెంపు కావాలి అంటే ఖచ్చితంగా 90 రోజులు ముందే అందుకు దాఖలు చేసుకోవాలని ధర్మాసనం తేల్చేసింది. సో నైజాంలో ఇక నుంచి టికెట్ ధరల అంశం మరింత క్లిష్టంగా మారుతుంది అని చెప్పొచ్చు.

Exit mobile version