పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ది రాజా సాబ్’. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. మరి వీరిలో యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఒకరు. అయితే నిధి అగర్వాల్ కి సంబంధించి ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిన్న రాజా సాబ్ రెండో సాంగ్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో నిధి అగర్వాల్ కి దారుణమైన అనుభవం ఎదురైంది. ఆమెని ముందుకు వెళ్లనివ్వకుండా ఊపిరి ఆడని పరిస్థితిని అక్కడ జనం కలిగించారు. మీద మీదకి పడిపోతూ ఆమెకి అసౌకర్య వాతావరణం క్రియేట్ చేయడంతో ఈ షాకింగ్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.
