‘బందిపోటు’లో శ్రద్ధా దాస్ ఐటెం సాంగ్..!

sradda-das
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఈ హాట్ హీరోయిన్ పై ఇటివలే ఓ ఐటెం సాంగును కూడా షూట్ చేశారు. సాంగుతో పాటు మరికొన్ని సన్నివేశాలలో శ్రద్ధా దాస్ కనిపించనుంది. సినిమాలో ఈ సాంగ్ వన్ అఫ్ ది హైలైట్ గా ఉంటుందని సమాచారం.

అల్లరి నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రాబిన్ హుడ్ తరహాలో ఈ సినిమా ఉంటుంది. అల్లరి నరేష్ ఘరానా దొంగగా కనిపిస్తారు. అవసరాల శ్రీనివాస్, సంపుర్ణేష్ బాబులు ముఖ్య పాత్రలలో నటించారు. నరేష్ గత సినిమాలకు భిన్నంగా పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు.

Exit mobile version