
ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో కనిపించి తన అందచందాలతో ఆకట్టుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్ ఈ ఏడాది ‘రేయ్’ సినిమాలో మునుపెన్నడూ కనపడననంత గ్లామరస్ గా మరియు హాట్ హాట్ గా కనిపించడమే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచి మార్కులు కొట్టేసింది. శ్రద్ధ దాస్ మరోసారి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చేసిన సినిమా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ కానుంది శ్రద్ధ దాస్.
ఈ మూవీలో శ్రద్ధ దాస్ చేసింది చిన్న పాత్రే అయినా సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. ఒకవైపు సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే, తన నెక్స్ట్ మూవీ ప్రమోషనల్ వీడియో షూటింగ్ లో కూడా శ్రద్ధ దాస్ బిజీ కానుంది. శ్రద్ధ దాస్ నెక్స్ట్ మూవీ ‘గుంటూరు టాకీస్’. ఈ సినిమాకి సంబందించి శ్రద్ధ దాస్ పై ఓ ప్రమోషనల్ వీడియోని రేపటి నుంచి షూట్ చేయనున్నారు. దేన్నీ బట్టి రానున్న నాలుగు రోజు శ్రద్ధ ఒకవైపు సూపర్ స్టార్ కిడ్నాప్ రిలీజ్ ప్రమోషన్స్ లో, మరోవైపు గుంటూరు టాకీస్ ప్రమోషనల్ వీడియో షూట్ లో బిజీ బిజీగా ఉండనుంది. ఇది కాకుండా శ్రద్ధ దాస్ హిందీలో హంటింగ్ ఆఫ్ బాంబే మిల్స్ అనే సినిమా చేస్తోంది.