ట్విట్టర్లో శృతి హాసన్ – ‘శ్రీమంతుడు’ సక్సెస్ చాట్ లో చారుశీల క్రేజీ సమాధానాలు

ట్విట్టర్లో శృతి హాసన్ – ‘శ్రీమంతుడు’ సక్సెస్ చాట్ లో చారుశీల క్రేజీ సమాధానాలు

Published on Aug 12, 2015 4:56 PM IST

shruthi-hassan1
సౌత్ ఇండియన్ అందాల భామ శృతి హాసన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ ని ఈ చిత్ర టీంతో కలిసి చేసుకోవడం కోసం ఈ రోజు హైదరాబాద్ చేరుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియా ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. శృతి హాసన్ ని అడిగిన కొన్ని క్రేజీ ప్రశ్నలు, దానికి శృతి హాసన్ ఇచ్చిన సమాధానాలు మీకోసం..

ప్రశ్న) మహేష్ బాబులో మీరు అమితంగా మెచ్చుకునే ఒక విషయం చెప్పండి.?
స) ఆయన ఓపిక..

ప్రశ్న) మీ ఫేవరైట్ మ్యూజిక్ బ్యాండ్/ ఆర్టిస్ట్ ఎవరు.?
స) ఇంకుబోస్

ప్రశ్న) మీ ఫేవరైట్ కార్టూన్ ఏంటి.?
స) కరేజ్ ది కౌవర్డ్లీ డాగ్

ప్రశ్న) నీ పరంగా నీకు అన్నీ చెప్పే బెస్ట్ క్రిటిక్ మరియు సపోర్టర్ ఎవరు.?
స) నేనే.

ప్రశ్న) ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలనుకుంటున్న యంగ్ నటీనటులకి మీరిచ్చే సలహా.?
స) మీకు మీరు నిజాయితీగా ఉండండి. అలాగే ఎప్పుడు ఇక కాదు, చెయ్యలేను అని నీరుగారిపోవద్దు.

ప్రశ్న) మీ ఫేవరైట్ సూపర్ హీరో ఎవరు.?
స) బాట్ మాన్

ప్రశ్న) మీ ఫేవరైట్ పెట్ ఏమిటి.?
స) పిల్లులు

ప్రశ్న) ఇప్పుడు మీతో పాటు ఉన్న పోటీపడుతున్న హీరోయిన్స్ లో మీ ఫేవరైట్ ఎవరు.?
స) తమన్నా

ప్రశ్న) మీ ఫేవరైట్ చాక్లెట్.?
స) గోడివ

ప్రశ్న) మీ ఫేవరైట్ వాఖ్యం ఏమిటి.?
స) నో పెయిన్ నో గెయిన్

ప్రశ్న) మీ ఫేవరైట్ హాలిడే స్పాట్ ఏమిటి.?
స) లాస్ ఏంజల్స్

ప్రశ్న) మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ .?
స) దేవుడిని నమ్మడం.

ప్రశ్న) హీరోయిన్ కాకపోతే ఏమయ్యే వారు.?
స) ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసేవాడిని.

ప్రశ్న) కమల్ హాసన్ డైరెక్షన్ లో నటించాలన్న ఐడియా ఉందా.?
స) అది నా డ్రీమ్..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు