తొలిసారి డబ్బింగ్ చెప్తున్న శృతి హాసన్.

Shruti-Hassan

శృతి హాసన్ గ్లామరస్ హీరోయిన్ మాత్రమె కాదు, చక్కని సింగర్ కూడా. తెలుగు, తమిళ, హింది భాషలలో అనేక హిట్ సాంగ్స్ పాడింది. తాజాగా తను నటించే సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్తుంది. తనలో కొత్త యాగింల్ ను త్వరలో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. తెలుగులో ఇప్పటివరకు 7 సినిమాలో నటించిన శృతి హాసన్ డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి.

విశాల్ సరసన ‘సింగం’, ‘యముడు’ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో నటిస్తున్న తమిళ సినిమా ‘పూజై’. తెలుగులో ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమాలో శృతి ఒక పాట పాడింది. రెండు భాషలలోను ఆమె గొంతు వినిపించబోతుంది, అంతే కాదు తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పనుండం విశేషం. దీపావళి కానుకగా ‘పూజ’ను విడుదల చేస్తున్నట్టు హీరో నిర్మాత అయిన విశాల్ వెల్లడించారు.

Exit mobile version