శృతి హాసన్ ని సర్ప్రైజ్ చేసిన న్యూ ఇయర్ గిఫ్ట్

shruthi-hasan
సౌత్ ఇండియన్ గ్లామరస్ బ్యూటీ న్యూ ఇయర్ దగ్గర పడుతున్న కొద్దీ వరుసగా హ్యాపీ మొమెంట్స్ జరుగుతున్నాయి. శృతి హాసన్ తెవర్ లో చేసిన సాంగ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా యు ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సంతోషంలో ఉండగానే శృతి ఆనందం మరింత రెట్టించేలా తన ఫ్రెండ్ న్యూ ఇయర్ కానుకగా ‘టైగర్’ నెక్ పీస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. దాంతో శృతి మరింత హ్యాపీగా ఉంది.

ఈ ఆనందాన్ని శృతి హసన్ ట్విట్టర్ లో షేర్ చేసుకుంటూ ‘స్టన్నింగ్ టైగర్ నెక్ పీస్ ఇచ్చినందుకు చాల థాంక్స్ రాధిక జేస్రని.. ఈ టైగర్ నాకు చాలా నచ్చిందని’ ట్వీట్ చేసింది. శృతి హాసన్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తోంది. ఇది కాకుండా హిందీలో రెండు, తమిళంలో ఒక సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Exit mobile version