శృతిహాసన్-టాలీవుడ్ మహాలక్ష్మి

shruti
కొన్ని సంవత్సరాల క్రితం ఐరన్ లెగ్ గా భావించిన శృతిహాసన్ కెరీర్ ని పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా తో మొత్తం మార్చేశాడు. కమల్ హాసన్ కూతురిగా పరిచయమైన ఈ భామ లక్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది, ఆ సినిమా పరాజయం పాలవ్వడంతో తెలుగులోకి మారి ఇక్కడ అనగనగా ఒక ధీరుడు సినిమాలో నాయికగా మెరిసింది. ఈ సినిమా కూడా పరాజయంపాలవ్వడంతో డీలా పడిపోయింది శృతి కానీ ఎక్కడా ఆత్మవిశ్వాసం తగ్గకుండా పోరాట పటిమతో తండ్రి సినిమాకి సంగీతం సమకూర్చడం, కొన్ని తమిళ సినిమాలలో పాటలు పాడడం వంటి పనులు చేస్తూ రెండవ సినిమా ఓ మై ఫ్రెండ్ లో కనిపించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.

కానీ 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె జాతకాన్నే మార్చేసింది.ఈ చిత్రంలో శృతిని కధానాయికగా ఎంచుకున్నపుడు పవన్ పక్కన ఈ ఐరన్ లెగ్ భామ ఏంటని అంతా గోల చేసారు.కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఆమెతోనే సినిమా పూర్తి చేసారు.గబ్బర్ సింగ్ విడుదలై సంచలన విజయం సాధించింది.

ఇక ఆ తరువాత శృతి వెనుతిరిగి చూడలేదు.రాత్రికి రాత్రి శృతి స్టార్ అయిపొయింది,తనకి ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేసాయి.ఆ తరువాత రవితేజ తో బలుపు లో నటించింది.అప్పటిదాక ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకి ఈ సినిమా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

బలుపు తరువాత శృతి టాలీవుడ్ మహాలక్ష్మిగా మారిపోయింది.శృతి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.తను తెలుగులో నటించిన ఎవడు,రేస్ గుర్రం తో పాటు హిందీలో నటించిన డిడే,రామయ్యావస్తావయ్య చిత్రాలు సంచలన విజయం సాధించాయి.

ఒక మామూలు నటి స్థాయి నుంచి అత్యధిక పారితోషికం తీసుకునే నాయిక గా ఎదిగింది.అవార్డులు,బ్రాండ్ ఒప్పందాలతో శృతి తన బెస్ట్ ఫాంలో ఉంది.హిందీ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో చక్రం తిప్పుతోంది.ముందు ముందు శృతికి హిందీలోకొన్ని అద్భుతమైన సినిమాలున్నాయి.వీటితో శృతి దేశం అంతటిని ఆశ్చర్యపరిచి తనవైపుకి తిప్పుకోనుంది.

Exit mobile version