మురుగదాస్ ‘కత్తి’ తర్వాత తమిళ అగ్ర హీరో విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకేక్కే కొత్త సినిమాలో నటించడానికి శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోషల్ మీడియాలో శృతి ఈ వార్తను వెల్లడించింది. మొదట ఈ సినిమాలో హిందీ హీరోయిన్లు దీపిక పడుకొనే లేదా ప్రియాంక చోప్రా నటించవచ్చు అని గాసిప్స్ హాల్ చల్ చేశాయి. తన ట్వీట్ తో వాటికి చెక్ పెట్టింది శృతి. ఇంకా విజయ్ – శృతి హాసన్ ల సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు.
కమల్ హాసన్ ముద్దుల కూతురు తన మాతృభాష తమిళం మరియు హిందీలో ఎక్కువ సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఆరు సినిమాలు సెట్స్ పై ఉంటె అందులో మూడు హిందీ, రెండు తమిళ సినిమాలు కావడం విశేషం. తెలుగులో వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు తన ఖాతాలో వస్తున్నా సినిమాలో ఎంపికలో జాగ్రత్త వహిస్తుంది. శ్రీను వైట్ల, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకేక్కబోయే సినిమాలో శృతి హీరోయిన్ అని సమాచారం.
