
తెలుగు, తమిళం, హిందీ.. ఇలా అన్ని భాషల సినిమాలతో బిజీబిజీగా మారిపోయింది శృతి హాసన్. ప్రస్తుతమున్న హీరోయిన్లలో వరుస సినిమాలతో టాప్ వరుసలో చేరిపోయిన శృతి, బాలీవుడ్‌లో రూపొందే ఓ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈమధ్యే ‘గబ్బర్’ సినిమాతో బాలీవుడ్‌ను మెప్పించిన శృతి, ‘యారా’ సినిమాతో బాలీవుడ్‌లో మరింత మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ‘పాన్ సింగ్ తోమార్’, ‘సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్’ సినిమాలతో విలక్షణ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టిగ్మన్షు దులియా తెరకెక్కిస్తున్న తాజా సినిమానే ‘యారా’.
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, అమిత్ సాద్, విద్యుత్ జమాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్‌ను శృతి హాసన్ నిన్ననే పూర్తి చేశారు. ఈ సందర్భంగా యారా సినిమా గురించి మాట్లాడుతూ “టిగ్మన్షు గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయడం నిజంగా నా అదృష్టం. నా కెరీర్లో యారా ఓ మంచి గుర్తుంచుకోదగ్గ సినిమాగా నిలుస్తుంది. నా పాత్రను తెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఉంది” అంటూ యారా విశేషాలను పంచుకున్నారు శృతి హాసన్. ఇదిలా ఉంటే.. శృతి హాసన్ తాజా తెలుగు చిత్రం ‘శ్రీమంతుడు’ జూలై 17న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే!

