‘శ్రీమంతుడు’ చారుశీలతో ట్విట్టర్ ఇంటరాక్షన్!

‘శ్రీమంతుడు’ చారుశీలతో ట్విట్టర్ ఇంటరాక్షన్!

Published on Aug 11, 2015 10:00 PM IST

srimanthudu (2)
సూపర్ స్టార్ మహేష్ బాబు – అందాల తార శృతి హాసన్.. ఈ ఇద్దరి జంట తెరపై ఎంత అందంగా ఉండనుందనేది ‘శ్రీమంతుడు’తో ఋజువైపోయింది. పోస్టర్, ట్రైలర్‌తోనే మహేష్-శృతిల జంటపై విపరీతమైన ఆసక్తి చెలరేగగా, సినిమా విడుదల తర్వాత వెంటనే అంతా ఈ పెయిర్‌ను హిట్ పెయిర్ అనేస్తున్నారు. గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన ఈ సినిమా, సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. శ్రీమంతుడు విషయంలో కథాంశం, మహేష్ యాక్టింగ్, కొరటాల శివ టేకింగ్‌తో పాటు శృతి హాసన్ రోల్, పర్ఫామెన్స్‌కు కూడా మంచి గుర్తింపు దక్కింది.

‘శ్రీమంతుడు’లో చారుశీల అనే ఓ స్ట్రాంగ్, ఇండిపెండెంట్ వుమెన్‌గా కనిపించి శృతి హాసన్ అలరించారు. ఇక సినిమాకు, తన రోల్‌కు వస్తోన్న స్పందన పట్ల శృతి హాసన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేష్, కొరటాల శివలకు ఆమె థ్యాంక్స్ తెలిపారు. ఇక తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకుల కోసం, వారితో ముచ్చటించేందుకు శృతి సిద్ధమయ్యారు. రేపు (ఆగష్టు 12) మధ్యాహ్నం 12:30గంటలకు ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు శృతి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అందుబాటులో ఉంటారు. #AskChaarusheela పై శృతి హాసన్‌ను ప్రశ్నలడగవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు