కోయంబత్తూర్ తో లవ్లో పడ్డ శృతి హాసన్

shruthi-hassan
అందాల భామ శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ మరియు హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఈ సంవత్సరం తెలుగులో ‘ఎవడు’, ‘రేసు గుర్రం’ రూపంలో వరుసగా రెండు హిట్స్ అందుకుంది.

ప్రస్తుతం శృతి హాసన్ హరి డైరెక్షన్ లో విశాల్ సరసన నటిస్తున్న పూజై షూటింగ్ లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోయంబత్తూర్ లో జరుగుతోంది. శృతికి కోయంబత్తూర్ బాగా నచ్చేయడంతో ‘కోయంబత్తూర్ లో షూటింగ్, లవ్లీ ప్లేస్.. సూపర్బ్ ఫుడ్ అని’ ట్వీట్ చేసింది. ఇది కాకుండా శృతి హాసన్ ప్రస్తుతం ‘గబ్బర్’, ‘వెల్ కం బ్యాక్’ సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version