బాలీవుడ్ లో మరో హిట్ అందుకున్న శృతి హాసన్

బాలీవుడ్ లో మరో హిట్ అందుకున్న శృతి హాసన్

Published on Sep 6, 2015 6:00 PM IST

shruthi-hassan

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్, స్టార్డం ప్రకారం చూసుకుంటే.. ఒక హీరోయిన్ ఒక భాషలో స్టార్డం తెచ్చుకోవడమే చాలా కష్టం కానీ సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ శృతి హాసన్ ఒకే సారి సౌత్ ఇండియాలోని స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా వరుసగా హిట్ సినిమాల్లో నటిస్తూ కెరీర్లో బిజీ బిజీగా ఉంది. ఇటీవలే తెలుగులో శ్రీమంతుడు రూపంలో సూపర్ హిట్ అందుకున్న శృతి హాసన్ ఈ వారం బాలీవుడ్ లో మరో హిట్ అందుకుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ మూవీ ‘వెల్ కం బ్యాక్’. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై విమర్శకుల నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం కలెక్షన్స్ కొల్లగొడుతోంది. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా 50 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి దూసుకుపోతోంది. 2007 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘వెల్ కమ్’కి సీక్వెల్ గా రావడమే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఈ సినిమా మొదటి వారంలోనే 100కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. ‘గబ్బర్’ సినిమా తర్వాత శృతి హాసన్ కి హిందీలో మరో స్ట్రైట్ హిట్ ఈ సినిమా. శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆగష్టు లో శ్రీమంతుడుతో, సెప్టెంబర్ లో వెల్ కమ్ బ్యాక్ తో హిట్స్ అందుకున్న శృతి హాసన్ అక్టోబర్ లో ‘పులి’తో హిట్ అందుకోవడానికి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు