
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ గత వారంలో పూణేలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మహేష్ అడ్డాలో హీరోయిన్ శృతి హాసన్ అడుగు పెట్టింది. ఆదివారం నుండి మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ వార్తను సోషల్ మీడియాలో వెల్లడించింది.
‘ఈ రోజు కొత్త తెలుగు సినిమా షూటింగ్ ప్రారంభించాను. సెట్స్ లో అందరూ ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు, గ్రేట్ డే. ఇదొక మంచి సినిమాగా రూపొందుతుందని నేను భావిస్తున్నాను.’ అని శృతి హాసన్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించింది.
ఈ షెడ్యూల్ నవంబర్ 16 వరకు కొనసాగుతుంది. సినిమా టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీస్ పతాకంపై యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2015 వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.