కాశ్మీర్ వరద బాధితులకు అండగా శృతి హాసన్.

Shruti-Haasan

తనకు అందమైన రూపం మాత్రామే కాదు అంత కంటే అందమైన మనసు ఉందని నిరూపిస్తుంది శృతి హాసన్. కాశ్మీర్ లో ఆకస్మిక వరదల కారణంగా అనేక మంది ప్రజలు నిరాశ్రయులు అయిన సంగతి తెలిసిందే. వీరికి కోసం విరాళాలు సేకరించడానికి ముంబైలో నిర్వహించిన ర్యాలిలో శృతి హాసన్ పాల్గొన్నారు. శృతి వంటి తారలు మంచి ఆలోచనతో చేపట్టే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన పలువురికి స్ఫూర్తినిస్తుంది. పలు స్వచ్చంద సంస్థలు, విద్యార్ధులు పాల్గొంటున్న ఈ ర్యాలిలో భాగస్వామి కావడం సంతోషం ఉందని శృతి తెలిపారు.

ఇక సినిమాల విషయానికి వస్తే శృతి హాసన్ ప్రత్యేక గీతంలో నటించిన ‘ఆగడు’ ఈమధ్యనే విడుదలయింది. త్వరలో మహేష్ బాబు – కొరటాల శివ మరియు రామ్ చరణ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకేక్కబోయే సినిమాల షూటింగ్ లలో పాల్గొంటారు.

Exit mobile version