
అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘షమితాబ్’. ఆర్ బల్కి దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్నాడు, ‘రాంఝానా’తో హిట్ కొట్టిన తర్వాత హిందీలో ధనుష్ నటిస్తున్న రెండవ హిందీ సినిమా. ఈ సినిమాతోనే కమల్ హాసన్ రెండవ కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ఫెబ్రవరి 6న ఈ సినిమా విడుదలవుతుంది. అక్షర హాసన్ ఆ రోజు అగ్ని పరీక్షను ఎదుర్కోనబోతుంది.
అక్షర హాసన్ అక్క, కమల్ పెద్ద కుమార్తె శృతి హాసన్ కూడా ‘లక్’ సినిమాతో హిందీ తన లక్ టెస్ట్ చేసుకుంది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు, తమిళ భాషలలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. శృతికి కలసిరాని బాలీవుడ్ చెల్లెలు అక్షరకు ఎంత వరకు హెల్ప్ అవుతుందో..? చూడాలి. ఫెబ్రవరి 6న ‘షమితాబ్’తో అమితాబ్ హిట్ ఇస్తే ఓకే, లేదంటే అక్షర హాసన్ కూడా అక్కలా బ్యాక్ టు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనాల్సిందే. ఎలాగో కమల్ కూతురి హోదాలో నాలుగు అవకాశాలు ఈజీగా వస్తాయి.