నందమూరి కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘పటాస్’. ఇప్పటి వరకూ ‘పటాస్’ సినిమా షూటింగ్ 90% పూర్తయ్యిందని, అలాగే డిసెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ చిత్ర టీం ఇదివరకే తెలియజేసింది. ఈ సినిమా ద్వారా శృతి సోది హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది.
శృతి సోది ఇందులో పోలీసులకు ప్రశ్నలు విసిరే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. ‘కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాలో ఓ జర్నలిస్ట్ గా కనిపిస్తాను. ఇది నా మొదటి తెలుగు సినిమా. మొదట తెలుగుతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ కళ్యాణ్ రామ్, అనిల్ ఇచ్చిన సపోర్ట్ చాలా త్వరగా అర్థం చేసుకోగలిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాకి సంబంధించి నా పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని’ శృతి సోది అంటోంది.
ఈ సినిమాతో రైటర్ అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.
