మీడియా ముందు స్పందించిన శ్వేతా ప్రసాద్

swetha_basu_prasad
వ్యభిచారం కేస్ లో ఎన్నో ఒడిదుడుకులకు లోనై కొన్నిరోజులు పునరావాస కేంద్రంలో గడిపిన శ్వేతాబసు ప్రసాద్ ఎట్టకేలకు బయటకొచ్చింది. వచ్చీ రావడంతోనే మీడియాని కడిగిపారేసింది. తనకు సంబంధం లేని తప్పుడు వార్తలు లెక్కలేనన్ని ప్రచారం చేశారని వాపోయింది.

తాను అసలా వ్యభిచారంలోకి పాల్గొనలేదని నిజమేమిటో, అబద్దమేమిటో తెలుసుకోకుండా మీడియా సంస్థలు ప్రకటనలు చేసేసాయని, కనీసం మా ఇంటిలో వాళ్ళని సైతం అడిగే ప్రయత్నం చెయ్యలేదని, ఈ దుశ్చర్యలో ప్రముఖ సంస్థలు కూడా వున్నాయని తెలిపింది.. తన కుటుంబ సభ్యులు కూడా శ్వేతా చాలా టాలెంటెడ్ నటీమణి అని, చిన్నతనం నుండి సినిమాలు, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలింస్ లలో నటించిందని తెలిపింది. తనకు సహాయం చేయని మీడియాపై తనకేమి కోపం లేదని తెలిపింది.

Exit mobile version