షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ : అల్లు అర్జున్ తర్వాత సిద్దార్ధ్

siddharth
ప్రముఖ హీరో సిద్దార్ధ్ త్వరలో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించనున్నాడు. ‘పిజ్జా’ ఫేం కార్తీక్ సుబ్బరాజ్ ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహిస్తారు. అంతే కాదు, కొత్తగా స్థాపించిన స్టోన్ బెంచ్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ సుబ్బరాజ్ స్వయంగా ఈ షార్ట్ ఫిల్మ్ ను నిర్మిస్తారు. వీరిద్దరి కలయికలో రూపొందిన తమిళ సినిమా ‘జిగర్తాండ’ కల్ట్ క్లాసిక్ గా మన్ననలు అందుకుంది. మంచి విజయం సాధించింది. త్వరలో ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది.

‘ఐ యాం దట్ చేంజ్’ అంటూ అల్లు అర్జున్ నటించిన షార్ట్ ఫిల్మ్ ఇంటర్నెట్ ప్రపంచంలో మంచి విజయం సాధించింది. సౌత్ ఇండియాలో ఒక స్టార్ హీరో షార్ట్ ఫిల్మ్ లో నటించడం అనే ట్రెండ్ ను ఇటీవల కాలంలో అల్లు అర్జున్ స్టార్ట్ చేశారు.

ఇతర ఒత్సాహిక షార్ట్ ఫిల్మ్ దర్శకులను ప్రోత్సహించాలి అనే ఉద్దేశ్యంతో స్టోన్ బెంచ్ క్రియేషన్స్ ను స్థాపించాను. త్వరలో ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభిస్తాను. అవకాశాల కోసం ప్రయత్నించే నటీనటులు, దర్శకులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ ను అన్ని భాషలలో సబ్ టైటిల్ తో విడుదల చేయడానికి మా కంపెనీ కృషి చేస్తుంది. తద్వారా వారి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుంది. అని కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు.

Exit mobile version