
తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన సిద్దార్ధ్ తాజా చిత్రం ‘జిగార్తందా’. దీన్ని తెలుగులో ‘చిక్కడు దొరకడు’గా అనువదించనున్నారు. ఈ సినిమా న్యూ యార్క్ దక్షిణ ఆసియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం తమిళ మాతృక 100రోజుల పండుగకు దగ్గరపడుతుంది
ఆ వేడుకలో ఈ చిత్రంతో పాటూ ‘హ్యాపీ ఎండింగ్’, ‘టిట్లీ’ మరియు ‘X’ సినిమాలు పోటీపడనున్నాయి. ఈ చిత్రాన్ని పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇంకా విడుదలకావాల్సివుంది. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మన టాలెంట్ ని గుర్తించే ఒక అరుదైన వేదిక. ఈ వేడుకలో ఇండియా, పాకిస్తాన్, శ్రీ లంక, బంగ్లాదేశ్ మరియు నేపాల్ దేశాలు పాల్గుంటాయి