మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ.. దర్శకుడు ఎవరంటే..?

Siddu-Jonnalagadda

‘డీజే టిల్లు’ ఫ్రాంచైజ్‌తో సూపర్ హిట్స్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ, కంఫర్ట్ జోన్‌ నుంచి బయటకు వచ్చి చేసిన ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి. ఈ పరాజయాల తర్వాత ఆయన ప్రాజెక్ట్ ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం బడ్జెట్ పరంగా సేఫ్‌గా ఉండే సినిమాలకే ఓకే చెబుతూ ముందుకు వెళ్తున్న సిద్ధు, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఈ వారం అధికారిక ప్రకటన రానుందట. షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. ఇక రవికాంత్ దర్శకత్వంలో సిద్ధు సైన్ చేసిన ‘బ్యాడాస్’ సినిమా, ఈ ప్రాజెక్ట్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది.

Exit mobile version