స్టార్టైన టాలెంటెడ్ హీరో చిత్రం “నరుడి బ్రతుకు నటన”.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒకడు. ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఉన్నా ఈ యంగ్ హీరో లేటెస్ట్ గానే తన “కృష్ణ అండ్ హిస్ లీల”తో మంచి బ్రేక్ ను అందుకున్నాడు. అయితే దాని తర్వాత తాను చేస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లలో నూతన దర్శకుడు విమల్ కృష్ణతో ప్లాన్ చేసిన క్రైమ్ అండ్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “నరుడి బ్రతుకు నటన”.

ఇంట్రెస్టింగ్ లైనప్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం కొన్నాళ్ల కితమే అనౌన్సమెంట్ ఇచ్చారు. మరి ఫైనల్ గా ఈ చిత్ర యూనిట్ ఈరోజు హారికా హాసిని వారు క్లాప్ మరియు స్విచ్ ఆన్ చెయ్యడంతో ముహూర్తం ముగించుకొని రెగ్యులర్ షూట్ కు రెడీ అయ్యింది.ఇక ఈ చిత్రానికి హీరో సిద్ధూ కూడా రచయితగా వర్క్ చేస్తున్నాడు. మరి అలాగే ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీతం అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మాణం వహించనున్నారు.

Exit mobile version