చేతిలో త్రిశూలం.. ఎదురుగా ఉగ్రరూపంలో పులి.. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ‘వాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, స్టార్ బ్యూటీ తమన్నా భాటియా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘వాన్’ (Vvaan – Force of the Forrest) కి సంబంధించి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. జానపద కథల నేపథ్యంతో, వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఈ వినూత్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్

రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్ వదిలిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక దట్టమైన అడవి నేపథ్యంలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇందులో చేతిలో త్రిశూలంతో ఉన్న ఒక యోధుడు కనిపిస్తుండగా.. ఒకవైపు ఉగ్రరూపంతో ఉన్న పులి, మరోవైపు రౌద్రంతో దూసుకొస్తున్న ఎద్దును చూపించారు. ఈ ఫాంటసీ విజువల్స్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక నయా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అనిపిస్తోంది.

మొదటిసారి చేతులు కలిపిన క్రేజీ కాంబో

ఈ బిగ్ స్క్రీన్ స్పెక్టాకిల్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రసిద్ధ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్ పిక్చర్స్ అధినేత ఏక్తా ఆర్ కపూర్, డిజిటల్ కంటెంట్ రంగంలో విప్లవం తెచ్చిన టీవీఎఫ్ (TVF Motion Pictures) మొదటిసారి జతకట్టడం విశేషం. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి సరికొత్త జానపద కథాంశంతో వస్తున్న సిద్ధార్థ్, తమన్నాల ‘వాన్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version