‘సైమా 2015’ సంబరం ముగిసింది..!

SIIma

సౌతిండియన్ అవార్డు వేడుకల విషయంలో సైమా అవార్డ్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకలో తారల తళుకులు, డ్యాన్స్ పర్ఫామెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఉంటాయి. 2012లో మొదటిసారిగా ఈ అవార్డ్స్ మొదలయ్యాయ్! ఇక అప్పట్నుంచీ దుబాయ్‌లోనే జరుగుతూ వస్తోన్న ఈ వేడుక ఈసారి కూడా దుబాయ్‌లోనే వైభవంగా జరిగింది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఆగష్టు 6.7 తేదీల్లో జరిగిన ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మళయాల ఇలా సౌతిండియన్ సినిమాలకు సంబంధించిన టాప్ స్టార్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

ఈసారి జరిగిన అవార్డు వేడుక కూడా ఎప్పట్లానే ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిందని తెలుస్తోంది. శృతి హాసన్, శ్రేయా లాంటి టాప్ స్టార్స్ పర్ఫామెన్స్ ఈ ఫంక్షన్‌కు హైలైట్స్‌గా నిలిచాయి. ఇక తెలుగు పరిశ్రమ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, రానా తదితరులు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. సౌతిండియాలోని నాలుగు ప్రధాన భాషా సినిమాలకు సంబంధించి వివిధ క్యాటగిరీల్లో అవార్డుల ప్రదాన జరిగింది. ఇక ఈ అవార్డు వేడుకను తిలకించాలంటే బుల్లి తెరపై ఈ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేసేదాకా చూడాల్సిందే!

Exit mobile version