సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం శింబు ప్రయత్నం..!

కోలీవుడ్ స్టార్ హీరో శింబు టాలీవుడ్‌లో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ‘డ్యూడ్’ ఫేమ్ దర్శకుడు కీర్తీశ్వరన్ చెప్పిన లైన్‌కు శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, మొదట ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నిజానికి శింబుకు మైత్రీ మూవీ మేకర్స్‌లో, అలాగే తమిళ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోనూ సినిమాలు చేయాల్సి ఉంది.

కానీ ప్రస్తుతానికి కీర్తీశ్వరన్ ప్రాజెక్ట్ మాత్రం సితార బ్యానర్‌పైనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి శింబు ఈసారి ఎలాంటి సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version