టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. గత రెండు సంవత్సరాలుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమాకి క్రేజీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న ఈ సినిమాకి పోటీగా బర్నింగ్ స్టార్ రంగంలోకి దిగనున్నాడు.
రాజమౌళి సినిమాకి బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు సినిమా పోటీనా అని ఆశ్చర్యపోతున్నారా.? మీరు వింటున్నది నిజమే.. సంపూర్నేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సింగం 123’ సినిమాని కూడా బాహుబలి రిలీజ్ రోజునే రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా అక్షత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సంపూర్నేష్ బాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మరి ఈ చిన్న సినిమాని ఫైనల్ గా భారీ బడ్జెట్ మూవీ బాహుబలితో రిలీజ్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
