
గత కొంతకాలంగా మంచు కుటుంబం మనకి కొన్ని ఆశక్తికరమైన చిత్రాలని అందిస్తుంది. ఇప్పుడు మరోసారి ‘సింగం 123’ తో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబుని హీరోగా మన ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సెటైరికల్ కామెడీ జూన్ 5న బ్రహ్మాండమైన విడుదలకు సిద్దం అవుతుంది. ఆడియన్స్ ని అలరించనుంది. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో వున్న కొన్ని కామెడీ స్పూఫ్ లు సంపూర్నేష్ బాబు పై చిత్రీకరించారు.ఈ చిత్రానికి సంభాషణలు మరియు విష్ణు అందించిన ఫన్నీ స్టొరీ లైన్ హైలైట్ కానున్నాయి. అక్షత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు