
‘నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి క్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజ్ లు తవ్వాలి’ అనే డైలాగ్ తో గత ఏడాది ట్రెండ్ సెట్ చేసిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. గత ఏడాది ‘హృదయ కాలేయం’తో మెప్పించిన సంపూర్నేష్ బాబు ఈ ఏడాది ‘సింగం 123’ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ ని రెండు రోజుల క్రితమే రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ అందరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ఈ ట్రైలర్ లో సంపూర్నేష్ బాబుని చూపించిన విధానం, సంపూ చెప్పిన డైలాగ్స్, కామెడీ సీన్స్ ఇలా అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా ఈ ట్రైలర్ లో సంపూర్నేష్ చెప్పిన డైలాగ్స్ కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ‘ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని’ అని చెప్పిన డైలాగ్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే ని కూడా అందించాడు. శేషు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ద్వారా అక్షత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మే చివర్లో లేదా జూన్ మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి