
తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో సూర్యను తెలుగులో స్టార్‌ను చేసింది ‘సింగం’ (యముడు) సినిమానే. ఆ తరువాత వచ్చిన ‘సింగం 2’ (సింగం) సినిమా కూడా బాగా ఆకట్టుకుందని చెప్పాలి . తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా వస్తోన్న ‘సింగం 3’ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్నది.
సింగం -3 సినిమాని దశరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా ఎటువంటి సమాచరం లేదు. ఈ సింగం సిరీస్‌లో ఇంతకు ముందు రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి నే మూడో సినిమాకూ దర్శకత్వం వహిస్తుండగా అనుష్క, శృతి హాసన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు.