తమిళ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే పరాశక్తి. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో వస్తుంది. అయితే ఇదే సంక్రాంతి బరిలో సరిగ్గా రెండేళ్ల కితం రావాల్సిన ఓ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చింది. మరి ఆ చిత్రమే ‘అయలాన్'(Ayalaan). దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ ఏలియన్ సినిమా 2024 సంక్రాంతికి వచ్చింది.
అయితే అప్పుడు తెలుగులో పలు ఇబ్బందులు కారణంగా సినిమా రిలీజ్ కాలేదు. తర్వాత తమిళ్ లోనే ఓటీటీలో కూడా వచ్చింది కానీ తెలుగులో రాలేదు. మరి ఫైనల్ గా ఈ సినిమా మన తెలుగు ఓటీటీ యాప్ ఆహా లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
