ఓటిటి సమీక్ష: ‘స్పర్శ’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Sparsha

విడుదల తేదీ : జనవరి 18, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: శివాజీ రాజా, శివా రెడ్డి, శివ కార్తీక్, త్రివేణి తదితరులు
దర్శకుడు: ప్రవీణ్ రామరాజు
నిర్మాణం: ప్రణీత బండ్రెడ్డి
సంగీతం: గణేష్ రాఘవేంద్ర
ఛాయాగ్రహణం: పురంజని కబ్రా
కూర్పు: అల్లూరి అనీల్ కుమార్ వర్మ

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ లఘు చిత్రమే ‘స్పర్శ’ (Sparsha). వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ కొత్త సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తన పల్లెటూరిలో వ్యవసాయాన్నే నమ్ముకుని సింపుల్ జీవితాన్ని సాగించే అరుసు (శివాజీ రాజా) తన ఇద్దరు కొడుకులు (శివా రెడ్డి, శివ కార్తీక్) లలో చిన్న కొడుకు (శివ కార్తీక్) తనతో ఊర్లోనే ఉంటాడు. పెద్ద కొడుకు సిటీలో సెటిల్ అవుతాడు. అయితే అరుసు, తన భార్య కలిసి పెద్దోడి ఇంటికి వాళ్ళు రమ్మన్నారని చెప్తారు. అలా వెళ్లిన తర్వాత వారు ఎందుకు అక్కడ ఇమడ లేకపోతారు? వారి మనవడు, మనవరాలితో వాళ్ళు చెప్పింది ఏంటి? ఈ సినిమా ద్వారా మేకర్స్ ఇచ్చిన సందేశం ఏంటి అనేది తెలియాలి అంటే చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ నుంచి వచ్చిన లఘు చిత్రాల్లో ఇదొక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. మెయిన్ గా ఇందులో ఎమోషన్స్ ఆకట్టుకున్నాయి. దర్శకుడు అనుకున్న పాయింట్ ని నీట్ గా ప్రెజెంట్ చేశారు. చూసే ఆడియెన్ దృష్టిని మొదట ఒకలా స్టార్ట్ చేసి తర్వాత మంచి ఎమోషనల్ ట్విస్ట్ లతో మెప్పించేలా చెప్పడం బాగుంది.

ముఖ్యంగా శివాజీ రాజా తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్లిన తర్వాత తన మనవడు, మనవరాలుతో ఫ్యామిలీ ట్రీ కోసం చెప్పిన సీక్వెన్స్ అందులోని డైలాగ్ లు ఇంకా సందేశం చాలా బాగుంది. ఇక వీటిని పక్కన పెడితే శివాజీ రాజా సహా శివారెడ్డి ఇతర నటీనటులు అంతా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో కోర్ పాయింట్ బాగానే ఉంది కానీ కొన్ని సీన్స్ మాత్రం రొటీన్ గానే అనిపిస్తాయి. అలానే కొన్ని కొన్ని సీన్స్ కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. మరీ ఇలాంటి వాటికి కూడా నెగిటివ్ అవుతుందా అనిపిస్తుంది. అలాగే చివరి కొన్ని నిమిషాలు తప్పితే మిగతా కథనం అంతా ఆల్రెడీ ఇదే కథా సుధలో వచ్చిన చాలా సినిమాల తరహాలోనే ఉంటుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సంగీతం, కెమెరా వర్క్ చాలా బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా బానే ఉంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు ప్రవీణ్ రామరాజు విషయానికి వస్తే.. తనో మంచి లైన్ తీసుకున్నారు. దానిని నెగిటివ్ యాంగిల్ లో స్టార్ట్ చేసి పాజిటివ్ గా మార్చడం తన విజన్ ని చూపిస్తుంది. అంతే కాకుండా ఇందులో సందేశం కూడా చాలా బాగుంది.

మంచి డైలాగ్స్ తో కుటుంబంలోని విలువలు ప్రస్తుతం ఉన్న రోజుల్లో పెద్దలు, పిల్లలు మధ్య మిస్సవుతున్న సున్నితమైన అంశాలని బాగా చెప్పారు. కనీసం స్పర్శ లేని బంధాలు ఉన్నా లేకపోయినా ఒకటే అనే రీతిలో ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. కొన్ని మూమెంట్స్ రొటీన్ అనిపించవచ్చు కానీ తన వర్క్ మాత్రం ఈ సినిమాకి బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “స్పర్శ” (Sparsha) అనే లఘు చిత్రం మంచి ఎమోషన్స్ అండ్ సందేశంతో సాగే ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. కొన్ని మూమెంట్స్ రొటీన్ అనిపించవచ్చు కానీ డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ చిత్రం నచ్చుతుంది. ప్రస్తుత రోజుల్లో పెద్దలు తమ పిల్లల నుంచి ఏం మిస్సవుతున్నారు అనే పాయింట్ ని దర్శకుడు ప్రెజెంట్ చేశారు. సో ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ లో ధారాళంగా చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Exit mobile version