లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో, ముప్పనేని శ్రీలక్ష్మీ సమర్పణలో రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన చిత్రం ‘దండోరా’. ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
“నాలుగు పుస్తకాలు చదివి లోకమంత తెలిసినోడి లెక్క మాట్లాడకు.. నీకు తెలియని లోకం ఇంకొకటి ఉంది” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. లవ్, కామెడీతో పాటు సామాజిక సందేశాన్ని కూడా ఇచ్చేలా ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు.
ఇక ఈ టీజర్ లాంచ్ సందర్భంగా శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని మాట్లాడారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
