సెన్సార్ డేట్ ని లాక్ చేసిన ‘సైజ్ జీరో’ టీం

సెన్సార్ డేట్ ని లాక్ చేసిన ‘సైజ్ జీరో’ టీం

Published on Sep 10, 2015 7:00 PM IST

Size-zero
సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ అనుష్క ప్రాజెక్ట్స్ వరుసగా రిలీజ్ కావడానికి సిద్దమవుతున్నాయి. అవే ‘రుద్రమదేవి’ మరియు ‘సైజ్ జీరో’. అక్టోబర్ 9న రిలీజ్ కానున్న రుద్రమదేవి సినిమాని పక్కన పెడితే, సైజ్ జీరో సినిమాతో అనుష్క ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి సిద్దమైంది. ఎలా అనుకుంటున్నారా.? ఇన్ని రోజులు హైట్ కి తగ్గా బాడీతో హాట్ గా కనిపించిన అనుష్క ఈ సినిమాలో బాగా బొద్దుగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం తను 20 కేజీల వెయిట్ కూడా పెరిగింది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ లో అనుష్క లుక్ అందరినీ సర్ప్రైజ్ అయ్యేలా చేసింది.

ఈ సినిమాని ముందుగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకొని ఆ తర్వాత వాయిదా వేసారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మాత్రం శరవేగంగా ఫినిష్ చేసి సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఫైనల్ ప్రోడక్ట్ ని రెడీగా ఉంచుకోవాలని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. అందుకే మరో 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసుకొని సెన్సార్ జరుపుకోవడానికి సెన్సార్ డేట్ ని కూడా లాక్ చేసింది. మాకు అందిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 21న తెలుగు వెర్షన్ ని, అలాగే సెప్టెంబర్ 22న తమిళ వెర్షన్ ని సెన్సార్ కి పంపడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. అందుకోసం సెన్సార్ వారి దగ్గర తమ సినిమా కోసం స్లాట్ కూడా బుక్ చేసేసారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ సినిమా ఆడియో రిలీజ్ డేట్ మరియు మూవీ రిలీజ్ డేట్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని అనౌన్స్ చేసే పనిలో ఈ చిత్ర టీం ఉంది. అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్ లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రకాష్ కోవెలమూడి డైరెక్టర్. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమాని పివిపి బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు